Putta Madhu: పార్టీ మార్పు ప్రచారంపై పుట్టా మధు ఏమన్నారంటే...

Putta Madhu: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు.

Update: 2022-11-18 09:40 GMT

Putta Madhu: పార్టీ మార్పు ప్రచారంపై పుట్టా మధు ఏమన్నారంటే...

Putta Madhu: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. సొంత పనుల కోసం ఢిల్లీ వెళితే.. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియా ప్రచారన్ని మీడియాలో ప్రసారం చేయడం బాధాకరమన్నారు. తనకు ఎమ్మెల్యేగా, జడ్పీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చిన పార్టీని విడిచి వేరే పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కొందరు పనిగట్టుకుని ఇలాంటి దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన పార్టీ కార్యకర్తలకు సన్నిహితులకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News