Municipal Elections 2026: నల్లగొండ అభివృద్ధి నా బాధ్యత: ఓటు వేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి!
Municipal Elections 2026: నల్లగొండ జిల్లా పబ్లిక్ స్కూల్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Municipal Elections 2026: నల్లగొండ జిల్లా పబ్లిక్ స్కూల్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండలో ఒక సంవత్సరం తర్వాత ప్రజలు ఊహించని అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లా పరిధిలోని పలు దేవాలయాలను పున:నిర్మిస్తామని మంత్రి తెలిపారు. 200 కోట్ల రూపాయలతో ఎంజి యూనివర్సిటీలో ఆధునిక టెక్నాలజీ కోసం నిధులు కేటాయించామన్నారు. నల్గొండ ప్రజలందరిని తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని హామి ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.