IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్!
IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా కీలకమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మేనేజింగ్ డైరెక్టర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్‌ను నియమించడం గమనార్హం.
మరికొన్ని కీలక మార్పులు ఇవే:
సవ్యసాచి ఘోష్: ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక సీఎస్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ ప్రత్యేక సీఎస్ బాధ్యతల్లోనూ కొనసాగనున్నారు.
దివ్య: పంచాయతీరాజ్ కమిషనర్‌గా ఈమెకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
సందీప్‌కుమార్ సుల్తానియా: ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
కాత్యాయనీ దేవి: ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా బదిలీ అయ్యారు. దీనితో పాటు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
మయాంక్ మిట్టల్: హైదరాబాద్ జలమండలి (HMWSSB) జేఎండీగా నియమితులయ్యారు.
రఘురామ్ శర్మ: పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్‌డీగా కూడా తన బాధ్యతలను కొనసాగిస్తారు.