Fire Accident: సంగారెడ్డిలో అగ్నిప్రమాదం: స్కూల్‌లో ఎగిసిపడిన మంటలు.. అదృష్టవశాత్తు తప్పిన పెను ప్రమాదం!
Fire Accident: సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire Accident: సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్కూల్‌కు సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే స్కూల్ భవనం మొత్తానికి వ్యాపించాయి. మంటలు ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. మంటల కారణంగా స్కూళ్లోని ఆఫీస్ రూమ్ పూర్తిగా దగ్ధమైంది. విద్యార్థుల క్లాస్ రూంలు, ఫర్నిచర్, పుస్తకాలు, ముఖ్యమైన రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి.
పొగలు ఆకాశాన్ని తాకేలా వ్యాపించడంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని గంటకు పైగా శ్రమించి మంటలను అదుపలోకి తీసుకొచ్చారు. ఫైర్ ఇంజిన్ ఆలస్యంగా చేరుకోవడం వల్లే మంటలు మరింతగా వ్యాపించాయని స్కూల్ యాజమాన్యం ఆరోపించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.