Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు
Hyderabad: 15 నిమిషాల పాటు రోడ్డుపైనే నగ్నంగా యువతి
Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు
Hyderabad: మణిపూర్ దురాగతాలు మరవకముందే హైదరాబాద్ నగరంలో మరో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో నడిరోడ్డుపై ఓ యువతిని వివస్త్రను చేశాడు ఓ వ్యక్తి. అక్కడే ఉన్న మరో మహిళ అడ్డుపడేందుకు ప్రయత్నించగా.. దాడి చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని.. బాలాజీనగర్ బస్టాండ్ దగ్గర చోటుచేసుకుంది.
బాలాజీ నగర్ బస్టాండ్ దగ్గర యువతి నడుచుకుంటూ వెళ్తుండగా పెద్ద మారయ్య అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. యువతిని అడ్డుకొని దుస్తులను చించేశాడు. నిస్సహాయస్థితిలో ఆ యువతి 15 నిమిషాల పాటు రోడ్డుపైనే నగ్నంగా ఉండాల్సి వచ్చింది. ఇది గమనించిన స్థానికులు అమ్మాయికి కవర్లు కప్పి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో యువతికి రక్షణ కల్పించిన పోలీసులు.. నిందితుడు పెద్ద మారయ్యను అరెస్ట్ చేశారు.