మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున వ్యక్తి అరెస్ట్
*చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు.. నిందితుడిపై అనేక ఆరోపణలు
మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున వ్యక్తి అరెస్ట్
Hyderabad: న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేసి... మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్న వక్కపట్ల చంద్రశేఖర్ అనే వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. హెర్బల్ లైఫ్ సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్... వెయిట్ లాస్ కోసం తన దగ్గరకు వచ్చే మహిళలతో చనువు పెంచుకొని న్యూడ్ వీడియోలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నిందితుడు గతంలో రాయదుర్గంలో ఓ మహిళను ట్రాప్ చేసిన కేసులో జైలుకు వెళ్లివచ్చాడు.