Etela Rajender: పార్టీ అవకాశం ఇస్తే మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుండి పోటీ చేస్తా
Etela Rajender: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. ఎలాంటి ప్రయోజనం ఉండదు
Etela Rajender: పార్టీ అవకాశం ఇస్తే మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుండి పోటీ చేస్తా
Etela Rajender: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. పార్టీ అవకాశం ఇస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉంటానన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.