Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ప్లాస్టిక్ గోదాం దగ్ధం
Hyderabad: హైదరాబాద్ నగర శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాలాపూర్ షహీన్ నగర్‌లోని ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి.
Hyderabad: హైదరాబాద్ నగర శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాలాపూర్ షహీన్ నగర్‌లోని ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఉవ్వెత్తున మంటలు ఎగిసి పడ్డాయి.
స్థానికులు ఇచ్చిన సమాచారంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలు అదుపు చేశారు. ప్లాస్టిక్ కావడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
గోదాములో ప్లాస్టిక్ నిల్వలు అధికంగా ఉండటంతో మంటలు అదుపులోకి రావడం కష్టమైంది. అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో బాలాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.