Jithendar Reddy: మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ నాదే
Jithendar Reddy: మహబూబ్‌నగర్ టికెట్ తనకే వస్తుందంటున్న జితేందర్
Jithendar Reddy: మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ నాదే
Jithendar Reddy: పార్లమెంట్ ఎన్నికలకు గాను బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ లిస్టులో మహబూబ్ నగర్ స్థానాన్ని ప్రకటించకుండా పెండింగులో పెట్టింది. ఈ స్థానం నుంచి డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి, శాంతికుమార్ టికెట్ ఆశిస్తున్నారు. ఈనేపథ్యంలో ఏపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. తనకు తిరుమల వెంకటేశ్వర స్వామి తోడున్నాడని, మహబూబ్‌నగర్ టికెట్ తనకే వస్తుందనే నమ్మకముందని ఆయన ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌ను ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌కు ట్యాగ్ చేశారు. ఇటీవల వాట్ టు డు.. వాట్ నాట్ టు డూ అంటూ చేసిన ఫన్నీ ట్వీట్ చేశారు. తాజాగా ఇప్పుడు చేసిన ట్వీట్‌తో.. టికెట్ ఎవరికిస్తారన్న చర్చ మొదలైంది. పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.