మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ బదిలీ
* బదిలీపై ఎమోషనల్ అయిన డాక్టర్ భీమ్ సాగర్ * బదిలీ అయ్యాక మంత్రి సత్యవతి రాథోడ్ పై భీమ్ సాగర్ ఆరోపణలు
Dr. Bheem Sagar (file image)
మంత్రి సత్యవతి రాథోడ్ పై మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భీమ్ సాగర్ కీలక వాఖ్యలు చేశారు తనను అకారణంగా బదిలీ చేశారని వాపోయ్యారు. తను 16 నెలల్లో పదవీ విరమణ పొందేది ఉందని ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్, జాయింట్ కమీషనర్, ఎట్ కమీషనరేట్ వీవీపీ హాస్పిటల్‌కు బదిలీ చేశారన్నారు.
మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో సుదీర్ఘంగా పనిచేశానని, ఆసుపత్రి అభివృద్ధికి ఏనలేని కృషి చేశానన్నారు. మంత్రి బంధువుకు సూపరింటెండెంట్ కట్టబెట్టేందుకే మంత్రి తనను బదిలీ చేయించనన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ తనను టార్గెట్ చేసి మానసికంగా వేధించారని కన్నీళ్లు పెట్టుకున్నారు