Collector VP Gautham Test Covid Positive: మహాబుబాబాద్ కలెక్టర్ వి.పి గౌతమ్ కు కరోనా పాజిటివ్
Collector VP Gautham Test Covid Positive: మహాబుబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి.గౌతం కరోనా బారిన పడ్డారు.
Representational Image
Collector VP Gautham Test Covid Positive: మహాబుబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి.గౌతం కరోనా బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అయన కరోనా పరీక్ష చేయించగా, కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అటు సోమవారం కలెక్టర్ అధ్వర్యంలో జరిగిన సమీక్షలో మంత్రులు ఈటెల రాజేందర్,ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ మాలోతు కవిత సహా పలువురు ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, హరిప్రియా కూడా పాల్గొన్నారు. అధికారుల సూచనల మేరకు వారుకూడా కరోనా టెస్ట్లు చేయించుకోనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 3,018 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,11,688కి చేరింది. మృతుల సంఖ్య 780కి పెరిగింది. మరోవైపు నిన్న 1,060 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 85,233కి చేరింది.
ప్రస్తుతం 25,685 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 19,113 మంది ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.69 ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 76.30కు చేరుకుంది. గత 24 గంటల్లో 61,040 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇప్పటి వరకూ మొత్తంగా 10,82,094 టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.