Hyderabad: 33 ఏళ్ల ఆమెతో 23 ఏళ్ల అతను.. సూపర్ క్రైమ్ కహాని

Hyderabad: నగరంలో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్న ఒక ప్రేమజంటను జూబ్లీహిల్స్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

Update: 2026-02-19 05:51 GMT

Hyderabad: ఆమెకు 33.. అతనికి 23.. జల్సాల కోసం..

Hyderabad: నగరంలో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్న ఒక ప్రేమజంటను జూబ్లీహిల్స్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పబ్‌లు, సినిమాలు, షికార్ల కోసం డబ్బు చాలక వరుసగా స్నాచింగ్‌లకు పాల్పడుతున్న వీరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన నరేంద్ర (23) ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రేవతి (33)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరు సనత్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. అయితే, తమ రోజువారీ విలాసాలకు, పబ్ ఖర్చులకు సంపాదన సరిపోకపోవడంతో ఈజీ మనీ కోసం స్నాచింగ్‌ను వృత్తిగా ఎంచుకున్నారు.

మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఫోన్ చూసుకుంటూ వెళ్తుండటాన్ని గమనించిన ఈ జంట.. బైక్‌పై ఆమెను వెంబడించారు. బైక్ నరేంద్ర నడుపుతుండగా, వెనుక కూర్చున్న రేవతి సదరు యువతి మెడలోని బంగారు గొలుసును క్షణాల్లో లాక్కొని పరారయ్యారు.

ఘటనపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా, నిందితులు బైక్‌పై గుంటూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. టోల్ ప్లాజాల వద్ద ఉన్న కెమెరాల ద్వారా వారి కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు.. స్నాచింగ్ జరిగిన కొద్ది గంటల్లోనే (రాత్రి 8 గంటల ప్రాంతంలో) నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

వీరిపై గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని, కేవలం విలాసాల కోసమే మొదటిసారి ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితులు పోలీసు కస్టడీలో ఉన్నారు.

Tags:    

Similar News