Khammam: లాక్ డౌన్ నేపథ్యంలో 1502 వాహనాలు సీజ్ : కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మం: లాక్ డౌన్ నేపథ్యంలో 1502 వాహనాలు సీజ్ చేసి, నేడు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో మరిన్ని వాహనాలపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. లాక్ డౌన్ బందోబస్తు ను సీపీ పరిశీలించారు. 700 వందల మందికి పైగా వాకర్స్ పై ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగి ప్రమాదకర పరిస్థితులు రాకముందే పోలీస్ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
అంక్షలు పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నవారిని గుర్తించి చెక్ పెట్టేందుకు పోలీస్ టెక్నికల్ టీమ్స్ ద్వారా ''సిటిజన్ ట్రాకింగ్ యాప్ ఫర్ కోవిడ్ 19'' యాప్ ద్వారా ఇంటి నుంచి బయటకు వచ్చే వాహనదారుడు డివిజన్ పరిధి దాటి ప్రయాణం చేస్తే చాలు మరో చెక్ పాయింట్లలో వున్న పోలీసులను అప్రమత్తం చేస్తుందని, ఆయా వ్యక్తులపై కేసు నమోదు, వాహనాన్ని సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అడీషనల్ డీసీపీ మురళీధర్, ఏసీపీలు వెంకటరెడ్డి, రామోజీ రమేష్, జ. హాంగీర్, వెంకట్రావు పాల్గొన్నారు.