Peddapalli: మల్యాల మోడల్ స్కూల్‌లో ‘హర్యానా’ హంగామా!
Peddapalli: పెద్దపల్లి జిల్లా మల్యాల పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
Peddapalli: మల్యాల మోడల్ స్కూల్‌లో ‘హర్యానా’ హంగామా!
పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాలలోని పీఎం శ్రీ (PM SHRI) తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేస్తూ, వారిలో జాతీయ ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు హర్యానా రాష్ట్ర విశిష్టతను చాటిచెప్పేలా అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. హర్యానా సంప్రదాయ దుస్తులు ధరించి, ఆ ప్రాంత జానపద నృత్యాలు, సంగీతం మరియు ఆచారాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా సాగిన ఈ ప్రదర్శనలు విద్యాసంస్థలో పండుగ వాతావరణాన్ని నింపాయి.