Karimnagar: ఖాలీ చేసే ప్రసక్తే లేదు.. అవసరమైతే ఆత్మహత్యే శరణ్యం!

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్థానికులు ఆక్రమించారు.

Update: 2026-03-25 06:52 GMT

Karimnagar: ఖాలీ చేసే ప్రసక్తే లేదు.. అవసరమైతే ఆత్మహత్యే శరణ్యం!

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మండలం ధర్మారం గ్రామం లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఆక్రమించుకున్న స్థానికులు. ప్రభుత్వం ఏడు సంవత్సరాలుగా అర్హత ఉన్న మాకు ఇల్లు కేటాయించడం లేదని వాపోయారు. ఇల్లు లేక నానాయాతలు పడుతూ కిరాయి చెల్లించలేక విధి లేని పరిస్థితిలో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ లు ఆక్రమించుకున్నట్లు తెలిపారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమమే అయినా మాకు వేరే గత్యంతరం లేక ప్రభుత్వానికి మా గోడు తెలిసే విధంగా ఇక్కడే వచ్చి వీటిని శుభ్రం చేసుకొని నివసిస్తామని ఇందులోకి వచ్చామన్నారు.

నిర్మించిన ఇండ్లను ఎందుకు పంపిణీ చేయడం లేదు..

గత ఏడు సంవత్సరాల నుండి అర్హులైన తమకు ఇండ్లు కేటాయించడం లేదని ఆరోపణ చేస్తున్న స్థానిక ప్రజలు. గత ప్రభుత్వం అర్హత కలిగిన నిరుపేదలకు డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇస్తామని నిర్మించిన ఇండ్లు పూర్తయిన కానీ పంపిణీ చేయకుండా నిరుపయోగంగా మార్చాలని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్మించిన ఇండ్లు పంపిణీ కాకుండా మళ్లీ కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే వాటిని సొంత స్థలం ఉన్న వాళ్ళే నిర్మించుకుంటున్నారని మాకు స్థలం లేదు కాబట్టి మాకు ఈ నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇండ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదు..

చాలా ఏళ్లుగా ఇండ్లు లేక చాలా యాతన అనుభవిస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్థలం లేక ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోలేని నిరుపేద పేదవారికి ఈ ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు అధికారులు ఎలాగూ పంపిణీ చేయడం లేదని ఖాళీగా ఉన్నాయి ఇండ్లలో నివాసం ఏర్పరచుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇందులో నివసిస్తున్నామని వాళ్లు తెలిపారు. తమను ఇండ్లు ఖాళీ చేయమంటే ఆత్మహత్య చేసుకుంటమని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News