Sultanabad: మురికి కూపాలకు చెక్.. సుల్తానాబాద్‌లో ప్రజా పాలన ప్రగతి బాట!
Sultanabad: పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదేశాల మేరకు సుల్తానాబాద్ 5వ వార్డులో పారిశుధ్య ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
Sultanabad: మురికి కూపాలకు చెక్.. సుల్తానాబాద్‌లో ప్రజా పాలన ప్రగతి బాట!
సుల్తానాబాద్ (పెద్దపల్లి జిల్లా): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో అమలు చేస్తున్న ‘99 రోజుల యాక్షన్ ప్లాన్’ వేగవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా 5వ వార్డులో పారిశుధ్య ప్రత్యేక డ్రైవ్‌ను బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదేశాల మేరకు, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ 99 రోజుల ప్రణాళికను రూపొందించారు. 5వ వార్డులోని డ్రైనేజీల పూడిక తీత, చెత్తాచెదారం తొలగింపు, మరియు దోమల నివారణకు ఫాగింగ్ వంటి చర్యలను మున్సిపల్ సిబ్బంది చేపట్టారు. మురికివాడల్లో వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.