Kamareddy: జుక్కల్ పాలిటిక్స్ హీట్.. షిండే వర్సెస్ కాంగ్రెస్ నేతలు!
Kamareddy: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పై మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kamareddy: జుక్కల్ పాలిటిక్స్ హీట్.. షిండే వర్సెస్ కాంగ్రెస్ నేతలు!
మద్నూర్ (కామారెడ్డి): ఉమ్మడి జిల్లాలో అత్యంత వెనుకబడిన జుక్కల్ నియోజక వర్గాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తు ప్రజల మన్ననలు పొందుతున్న జుక్కల్ అభివృద్ధి ప్రదాత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పై మాజి ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరస్వర్ సాయిలు ఖండించారు.ఈ సందర్భంగా సోమవారం మద్నూర్ మండల కేంద్రం లోని గ్రామ పంచాయతీ ఆవరణలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జుక్కల్ నియోజక వర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒరిగిపెట్టిందేమి లేదని మూడు సార్లు ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో కేవలం కాసులకు మాత్రమే పరిమితమైన షిండే నియోజక వర్గంలో ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదని విరుచుకుపడ్డారు. ఓకె ఒక సారి ఎమ్మెల్యే గెలిచి మొదటి సారి రెండున్నర ఏండ్లలో నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ఎంతో మెప్పు పొందుతున్న ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని హెచ్చరించారు.
మీడియా సమావేశంలో పాల్గొన్న నాయకులు
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పై మాజి ఎమ్మెల్యే షిండే అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మద్నూర్ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి, సలాబత్ పూర్ ఆంజనేయ ఆలయ కమిటి చైర్మన్ రామ్ పాటిల్, హoడే కేలూర్ సర్పంచ్ లక్ష్మణ్, చిన్న శక్కర్గ సర్పంచ్ దిగంబర్, చిన్న తడ్గుర్ సర్పంచ్ సూర్య వంశి ప్రకాశ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బండి.గోపి, వర్డ్ సభ్యులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.