Choppadandi: మేడిపల్లి సత్యం మార్క్ పాలిటిక్స్ 24 గంటల్లోనే హామీ అమలు!
Choppadandi: చొప్పదండి నియోజకవర్గ రైతుల కోసం కేవలం ఒకే రోజులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
Choppadandi: మేడిపల్లి సత్యం మార్క్ పాలిటిక్స్ 24 గంటల్లోనే హామీ అమలు!
Choppadandi: నిన్న హామీ ఇచ్చి, నేడు అమలు చేసిన ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ప్రతిబద్ధతకు రైతులు సాక్ష్యం. చొప్పదండి నియోజకవర్గంలో రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఆయన నాయకత్వం మరోసారి నిరూపితమైంది అని వ్యవసాయ కరీంనగర్ జిల్లా చొప్పదండి మార్కెట్ చైర్మన్ కొత్తూరి మహేష్ తెలిపారు.
రైతుల అభ్యర్థన మేరకు మక్కల కొనుగోలు కేంద్రాన్ని వారం రోజులలో ఏర్పాటు చేస్తాను అని ఇచ్చిన హామీని, కేవలం 24 గంటల్లోనే అమలు చేయడం, రైతుల నష్టం లేకుండా చూడటం, ఆయన వ్యతిరేక సందర్భాల్లోనూ నేరుగా స్పందించే నాయకత్వాన్ని చూపినదని తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో ఏకైక మక్కల కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌కు కేటాయించడం, రైతుల పట్ల ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంకితభావాన్ని నిరూపిస్తున్నదని ఆయన తెలిపారు.
రైతులకోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం అని చొప్పదండి మండల రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.