తెలుగు రాష్ట్రాల్లో జోరుగా మద్యం అమ్మకాలు

*తెలంగాణలో 25,238.29 కోట్లు సరకు విక్రయం *ఏపీలో రూ.21,169 కోట్ల విలువైన సరకు అమ్మకం

Update: 2022-02-21 08:39 GMT

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా మద్యం అమ్మకాలు

Telugu States: తెలుగు రాష్ట్రాలలో ప్రధాన ఆదాయవనరుగా మారింది ఆబ్కారీ శాఖ. అందుకు నిదర్శనం ప్రస్తుతం రాష్ట్రం లో మద్యం క్రయవిక్రయాలు భారీగా పెరగడమే. ప్రస్తుతం రాష్ట్రంలో వాణిజ్య పన్నుల రాబడుల తర్వాత అత్యధికంగా ఆదాయం వచ్చే వనరు అబ్కారీ శాఖదే గడిచిన కొంత కాలంగా మద్యం అమ్మకాలు, ఆదాయం పెద్ద ఎత్తున పెరిగింది.

పది నెలల్లో రూ.47వేల కోట్లు 2021-22 ఆర్థిక సంవత్సరంలో పది నెలల్లో దాదాపు 47వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. తెలంగాణలో 25,238వేల 29 లక్షల సరుకు విక్రయించారు. 3కోట్ల 7 లక్షల కేసుల లిక్కర్‌, 2కోట్ల 71లక్షల కేసుల బీరు అమ్ముడుపోయింది. ఇందులో తయారీ, విక్రయదారులకు 35 నుంచి 38శాతం వాటా పోగా.. మిగిలిన మెుత్తం వ్యాట్‌, ఎక్సైజ్‌ సుంకాలు, లైసెన్స్‌ ఫీజుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది.

ఇటు ఏపీలోనూ అదే జోరు..ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. 21,169 కోట్ల విలువైన సరకు అమ్ముడైంది. 2.13కోట్ల లిక్కర్‌, 62.90 లక్షల కేసుల బీరు విక్రయించారు. ఇందులో సగటున 20శాతం అంతకంటే తక్కువ మద్యం తయారీదారుల వాటా పోగా..మిగిలిన ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. ఏపీలో మద్యం అమ్మకాలు కాస్త తగ్గినా. ధరలు పెంచడంతో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుందని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 10 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వాలకు భవిష్యత్ ప్రధాన ఆదాయ వనురుగా ఎక్సైజ్ శాఖ మారినా ఆశ్చర్యం లేదంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News