Revanth Reddy: నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళాలు ఇద్దాం.. MLAలకు సీఎం సూచన

Revanth Reddy: జాతీయ రక్షణ నిధికి విరాళాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులను కోరారు.

Update: 2025-05-09 10:44 GMT

Revanth Reddy: నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళాలు ఇద్దాం.. MLAలకు సీఎం రేవంత్ సూచన

Revanth Reddy: జాతీయ రక్షణ నిధికి విరాళాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులను కోరారు. శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు ఒకనెల వేతనాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళాలివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారు. ఈ విషయమై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి చర్చించారు.

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైనికుల దాడి నేపథ్యంలో నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ప్రజాప్రతినిధులనుంచి విరాళాలను సేకరించాలని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో చర్చించి ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఉగ్రవాద పరిస్థితులపై అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలపై తెలంగాణ ప్రభుత్వం కాసేపట్లో కీలక సమావేశం జరగనుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క శాంతి భద్రతలపై ముందస్తుగా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి కాసేపట్లో సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీఎంఓ జయేష్ రంజన్, హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం నిర్వహించనున్నారు.

Tags:    

Similar News