Ponnam Prabhakar: బస్సు ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణమైతే..యజమానులపై కేసులు పెడతాం
Ponnam Prabhakar: బస్సు యజమానుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగితే.. హత్య నేరం కింద కేసులు పెట్టి లోపలేస్తామని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
Ponnam Prabhakar: బస్సు ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణమైతే..యజమానులపై కేసులు పెడతాం
Ponnam Prabhakar: బస్సు యజమానుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగితే.. హత్య నేరం కింద కేసులు పెట్టి లోపలేస్తామని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. స్పీడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని సూచించారు. రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులని ట్రావెల్స్ యజమానులు ఆరోపిస్తున్నారని పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు.