KTR Vs Konda Surekha: మంత్రి సురేఖపై కేటీఆర్ పరువునష్టం దావా.. నేడు విచారించనున్న నాంపల్లి కోర్టు
KTR Vs Konda Surekha: మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావాపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది.
KTR Vs Konda Surekha
KTR Vs Konda Surekha: మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావాపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ ప్రధాన కారణమని కొండ సురేఖ వివాస్పద వ్యాఖ్యలు చేశారు.
సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్.. సురేఖ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలతో సహా 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు అందించారు...
ఈ కేసులో సాక్షులుగా బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో ఇవాళ జరిగే విచారణపై ఉత్కంఠ నెలకొంది.