Mahesh Kumar Goud: కేటీఆర్ అరెస్టు ఖాయం
Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన రాజకీయ వ్యాఖ్యలు చేశారు.
Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా, ఆయన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై జోస్యం చెప్పడంతో పాటు పలు కీలక అంశాలపై మాట్లాడారు.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు కావడం ఖాయం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసి గత ఎన్నికల్లో గెలిచారని ఆయన ఆరోపించారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం ఏఐసీసీ (AICC) పరిధిలో ఉందని, ఈ విషయంపై అధిష్ఠానమే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
డీసీసీల ఏర్పాటుపై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం రాహుల్ గాంధీతో సమావేశం జరగనుందని మహేశ్ గౌడ్ వెల్లడించారు. ఈ భేటీకి ఏఐసీసీ కొత్తగా నియమించిన 22 మంది పరిశీలకులు కూడా హాజరవుతారని చెప్పారు.
ఈ పరిశీలకుల బృందం అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేస్తుందని ఆయన పేర్కొన్నారు.