KTR: ఎంపీ టికెట్ ఎవరికి..?.. గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్
KTR: క్యాంప్ కార్యాలయంలో ప్రకటించిన గుత్తా సుఖేందర్ రెడ్డి
KTR: ఎంపీ టికెట్ ఎవరికి..?.. గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్
KTR: ఎంపీ ఎన్నికలకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లారు. గుత్తాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నల్గొండ జిల్లా ఎంపీ స్థానంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఉమ్మడి నల్గొ్ండ జిల్లాలోని రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డిని నిలబెట్టాలన్న అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు పార్టీ శ్రేణులుల మాట్లాడుకుంటున్నారు.
అయితే.. గత 10 క్రితమే.. గుత్తా తన క్యాంప్ కార్యాలయంలో.. ఈసారి ఎంపీ ఎన్నికల్లో తన కొడుకు అమిత్ రెడ్డి తప్పకుండా పోటీ చేస్తాడని గుత్తా ప్రకటించారు. నల్గొండ లేదా.. భువనగిరి నుంచి ఏదో ఒకస్థానం నుంచి కచ్చితంగా బరిలో ఉంటారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ గుత్తా ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరిచకుంది.