KTR: కేసీఆర్‌కు పోటీగా నిలబడితే పేరు వస్తుంది.. డిపాజిట్ అయితే రాదు
KTR: ఆ రికార్డుకు కామారెడ్డి వేదిక కావడం మనందరికీ గర్వకారణం
KTR: కేసీఆర్‌కు పోటీగా నిలబడితే పేరు వస్తుంది.. డిపాజిట్ అయితే రాదు
KTR: సీఎం కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెడుతుంటే.. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని అన్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్‌కు పోటీగా నిలబడితే మంచి పేరు వస్తుందేమో గానీ, డిపాజిట్ అయితే రాదని, సీఎం కేసీఆర్‌తో పోటీ అంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టేనన్న విషయం.. బీజేపీ, కాంగ్రెస్‌కు తెలసన్నారు మంత్రి కేటీఆర్. రానున్న ఎన్నికల్లో దక్షిణ భారతదేశం నుంచి మొట్ట మొదటిసారి హ్యాట్రిక్ కొట్టిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ దేశ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆ రికార్డుకు వేదిక కామారెడ్డి కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు.