KTR: ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యం

KTR: లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్

Update: 2023-07-27 14:19 GMT

KTR: ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యం

KTR: హైదరాబాద్‌కి రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు మంత్రి కేటీఆర్. డీసిల్టింగ్ ఇప్పటికే పూర్తయిందని, చెరువుల బలోపేతానికి తీసుకున్న చర్యల వల్ల నష్టం అదుపులో ఉందన్నారు. వర్షాలు, వరదలకు ప్రాణ నష్టం జరగకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యం అని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారాయన. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామని చెప్పారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలన్నారు. హైదరాబాద్ నుంచి పురపాలక శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్.

Tags:    

Similar News