కేటీఆర్ పర్యటనలో ప్రమాదం.. లేడీ కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన బీఆర్ఎస్ కార్యకర్త

Update: 2025-03-23 11:59 GMT

కేటీఆర్ పర్యటనలో ప్రమాదం.. లేడీ కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన బీఆర్ఎస్ కార్యకర్త

BRS Karimnagar Meeting on 27th March: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం కరీంనగర్‌లో పర్యటించారు. కేటీఆర్ రాకతో ఆయన కాన్వాయ్‌ను అనుసరిస్తూ భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తల్లో ఒకరు బైక్ వేగాన్ని అదుపు చేసుకోలేక పద్మజ అనే లేడీ కానిస్టేబుల్‌ను ఢీకొట్టారు.

ఈ ఘటనలో లేడీ కానిస్టేబుల్ కాలు విరిగింది. వెంటనే పార్టీ శ్రేణులు ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆమె పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పద్మజకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు.

టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఈ నెల 27న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సభ ఏర్పాట్లు, ముందస్తు ప్రణాళికల్లో భాగంగానే కేటీఆర్ ఇవాళ కరీంనగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉచిత పథకాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఆ తరువాత ఆ హామీల గురించే మర్చపోయారని అన్నారు. ఈ 14 నెలల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఆరోపించారు. 

Tags:    

Similar News