Krishna Sagararao: 13 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా.. టికెట్ ఇస్తే.. గెలుస్తా..

Krishna Sagararao: నాకు చేవెళ్ల బీజేపీ కార్యకర్తలు, ప్రజల మద్దతు ఉంది

Update: 2024-01-24 11:00 GMT

Krishna Sagararao: 13 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా.. టికెట్ ఇస్తే.. గెలుస్తా..

Krishna Sagararao: చేవెళ‌్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని బీజేపీ ఆదేశిస్తే.. బరిలోకి దిగుతానన్నారు ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు. 13 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక చేస్తోన్న బీజేపీ.. తనను అభ్యర్థిగా ప్రకటిస్తే కచ్చితంగా విజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి తనను బలమైన అభ్యర్థిగా బీజేపీ భావిస్తే విజయం కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. తనకు టికెట్ కేటాయిస్తే పార్టీ తరపున సంపూర్ణ విజయం సాధించేందుకు కృషి చేస్తానని కృష్ణసాగర్‌రావు తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు, ప్రజల మద్దతు ఉందని కృష్ణసాగర్‌రావు తెలిపారు.

Tags:    

Similar News