Kotakonda: శ్రీ వీరభద్రస్వామి కల్యాణం.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం దంపతులు
Kotakonda: అర్చకుల వేదమంత్రాల నడుమ కన్నుల పండువగా కార్యక్రమం
Kotakonda: శ్రీ వీరభద్రస్వామి కల్యాణం.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం దంపతులు
Kotakonda: హన్మకొండ జిల్లా కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి కళ్యాణం బుధవారం వేదమంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగింది. స్వామివారి కల్యాణానికి రాష్ట్ర బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు సతీసమేతంగా పట్టువసస్త్రాలు సమర్పించారు. ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తుల సమక్షంలో పల్లకీని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారి కల్యాణానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.