Kishan Reddy: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి బాధ్యతగా తీసుకుంటా

Kishan Reddy: 26 కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్ లో ఒక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

Update: 2023-09-13 03:00 GMT

Kishan Reddy: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి బాధ్యతగా తీసుకుంటా

Kishan Reddy: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద డైనమిక్ లైటింగ్ సిస్టం ను ప్రారంభించిన కిషన్ రెడ్డి యూనివర్శిటీ లో హాస్టల్ గదులలో పాటు ఇతర వసతుల కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఉస్మానియా యూనవర్సిటీని పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.ఆర్ట్స్ కాలేజ్ వద్ద డైనమిక్ లైటింగ్ సిస్టం ను ఆయన ప్రారంభించారు. విద్యుత్ కాంతులతో ఆర్ట్స్ కాలేజ్ భవనం నూతన కళని సంతరించుకుంది.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ తాను హైదరాబాద్ వచ్చిన కొత్తలో తనకి తన మామయ్య ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ చూపెట్టాడని ప్రతీ ఒక్కరూ చూడాల్సిన ప్రాంతం ఉస్మానియా యూనివర్సిటీ అని అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఆర్ట్స్ కాలేజ్ ని మరింత అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ రోజు ట్రయల్ మాత్రమే అని త్వరలోనే లైట్ అండ్ సౌండ్ షో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆర్ట్స్ కాలేజ్ భవనం చరిత్ర తెలిపేలా ఓ పాటని గోరటి వెంకన్న రాశారని. త్వరలోనే ప్రారంభించుకుందామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక స్పోర్ట్స్ వసతులతో పాటు, గర్ల్స్ హాస్టల్ లో స్విమ్మింగ్ పూల్ ఇతర అభివృద్ది పనుల కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

హాస్టల్ గదుల కొరత,కొన్ని హాస్టల్ భవనాలు దెబ్బతిన్నట్లు తన దృష్టికి వచ్చిందని .కేంద్ర ప్రభుత్వ సహకారం తో రెండు హాస్టల్ భవనాలకి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వెంటనే టెండర్ పిలిపించి పనులు ప్రారంభించాలని వీసీ ని కోరారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ కింద మరిన్ని నిధులు మంజూరు చేసుకుందామని తెలిపారు.

నేషనల్ సైన్స్ సెంటర్ కావాలని ప్రతిపాదన ఉందని..త్వరలోనే దానిని కూడా మంజూరు చేసుకుందామన్నారు సంగీత నాటక అకాడమీ ని కూడా హైదరాబాద్ కు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 26 కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్ లో ఒక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News