Kishan Reddy: నేను ఏనాడూ పార్టీని ఏదీ అడగలేదు
Kishan Reddy: 1980 నుంచి ఒక సైనికుడిలా పనిచేస్తున్నా
Kishan Reddy: నేను ఏనాడూ పార్టీని ఏదీ అడగలేదు
Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి స్పందించారు కిషన్ రెడ్డి. తాను పార్టీకి విధేయుడినని.. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని చెప్పుకొచ్చారు. జులై 8న వరంగల్‌లో ప్రధాని మోడీ సభ తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి స్థానానికి సంబంధించి అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని...పార్టీ గెలుపు కోసం సమిష్టి ప్రణాళిక తయారుచేసుకుని ముందుకు వెళ్తామని తెలిపారాయన.