Kishan Reddy: ఇతర పార్టీల నుంచి కాకుండా.. సామాజిక సేవ చేసే వాళ్లను పార్టీలో చేర్చుకోవాలి
Kishan Reddy: మండలం, అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిలో.. కార్యాలయాలు ఏర్పాటు చేయాలి
Kishan Reddy: ఇతర పార్టీల నుంచి కాకుండా.. సామాజిక సేవ చేసే వాళ్లను పార్టీలో చేర్చుకోవాలి
Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పార్టీ పదాధికారుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పదాధికారులు, లోక్‌సభ స్థానాల ఇన్‌ఛార్జ్‌లు హాజరయ్యారు. సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు నేతలు. గత ఎన్నికల్లో బూత్ స్థాయిలో ఎదురైన లోపాలు సరిచేసుకోవాలని పదాధికారులకు సూచించారు కిషన్ రెడ్డి.
గ్రామస్థాయి నుంచి చేరికలను ప్రోత్సహించాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేసే వాళ్లను పార్టీలో చేర్చుకోవాలన్నారు. ఫిబ్రవరి మొత్తం చేరికల కోసం కేటాయించాలన్న కిషన్ రెడ్డి.. మండలం, అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.