Kishan Reddy: కేసీఆర్ తెలంగాణ ప్రజలను మద్యానికి బానిసలను చేశాడు
Kishan Reddy: బీరు, బ్రాంది అమ్మనిదే ప్రభుత్వ పూట గడవడం లేదు
Kishan Reddy: కేసీఆర్ తెలంగాణ ప్రజలను మద్యానికి బానిసలను చేశాడు
Kishan Reddy: బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ మాఫియాగా ఏర్పడి తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మద్యానికి బానిసలను చేశారని అన్నారు కిషన్‌రెడ్డి. ఓ చేతిలో ఫించన్ డబ్బులు పెట్టి, మరో చేతిలో బీరు బాటిళ్లు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో మద్యం కారణంగా కుటుంబాలు ఛిద్రమైనా కేసీఆర్‌కు పట్టింపులేదన్నారు. బీరు, బ్రాంది అమ్మనిదే ప్రభుత్వం పూట గడవడం లేదన్నారు. అప్పులు చేయనిదే సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్లడంలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని పూర్తిగా మద్యం తెలంగాణగా మార్చారంటూ కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.