ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై సస్పెన్స్.. బీఆర్ఎస్ ముందుకు బీజేపీ బంపర్ ఆఫర్..!

Khanapur Municipal Chairman Election: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఇంకా కొలిక్కిరాలేదు.

Update: 2026-02-18 10:12 GMT

ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై సస్పెన్స్.. బీఆర్ఎస్ ముందుకు బీజేపీ బంపర్ ఆఫర్..!

Khanapur Municipal Chairman Election: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఇంకా కొలిక్కిరాలేదు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవి కోసం అటు బీఆర్ఎస్... ఇటు బీజేపీ పట్టుబడుతున్నాయి. అయితే.. కుర్చీ కోసం పోట్లాడితే ఒరిగేదేమీ లేదని.. బీజేపీ ఓ అడుగు ముందుకు వేసింది. ఖానాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని బీఆర్ఎస్ తీసుకుంటే.. వైస్ ఛైర్మన్ పదవితోపాటు నాలుగు కో-ఆప్షన్ సభ‌్యులను తమకు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించింది. లేదంటే.. ఛైర్మన్ తమకు ఇచ్చి.. వైస్ ఛైర్మన్ పదవితో పాటు నాలుగు కో-ఆప్షన్ సభ్యులను బీఆర్ఎస్ తీసుకోవాలని సూచించింది. ఏది ఏమైనా ఖానాపూర్ అభివృద్ధికి తాము సిద్ధంగా ఉన్నామని... ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు స్పందించి ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News