CM KCR: తెలంగాణలో చారిత్రక ఘట్టం.. ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం
CM KCR: ప్రగతిభవన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం
CM KCR: తెలంగాణలో చారిత్రక ఘట్టం.. ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం
CM KCR: తెలంగాణలో రాష్ట్ర చరిత్రలో ఒకే సారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ విధానంలో 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. ఈ కార్యక్రమం చాలా ఆత్మసంతృప్తి కలిగే గొప్ప సన్నివేశమని అన్నారు సీఎం కేసీఆర్. పరిపాలన చేతకాదు అని ఎగతాళి చేసిన పరిస్థితులను చూశామని, అలాంటి తెలంగాణలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాని అన్నారు.
ఈ సంవత్సరంలో దాదాపు 24 వరకు చేరుకున్నామని, గతంలో ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 26కు చేరిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి 8 కాలేజీలు నూతనంగా ప్రాంరంభం కాబోతున్నాయన్నారు. వీటికి కేబినెట్ ఆమోదం కూడా లభించిందని సీఎం కేసీఆర్ తెలిపారు.