TS News: స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలు సాధించిన ముగ్గురు తోడు కోడళ్లు

Kumuram Bheem Asifabad: తొలిసారిగా గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురికి ఉద్యోగాలు

Update: 2024-01-30 15:00 GMT

స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలు సాధించిన ముగ్గురు తోడు కోడళ్లు

Kumuram Bheem Asifabad: ఒకే ఇంట్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు సాధించారు ముగ్గురు తోడు కోడళ్లు. కుటుంబంలో ఎవరికైనా ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునే ఈ రోజుల్లో ఒకే ఇంట్లో నుంచి ముగ్గురికి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు రావడంతో కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బైపోతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లంబాడిగూడ గ్రామ పంచాయతీలోని మారుమూల గ్రామం బొగుడగూడలో ఒకే కుటుంబం నుండి ముగ్గురు మహిళలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు వరించాయి. ఆదివారం వెలువడిన స్టాఫ్ నర్స్ ఫలితాలలో గోమాసి పుష్ప, గోమాసి పత్రుబాయి ఇద్దరు తోడికోడళ్లు ఉద్యోగాలు సాధించారు. కాగా.. 2021లో గోమాసి సునీతకు ఉద్యోగం వచ్చింది.

గోమాసి పుష్ప GNM కోర్స్ పూర్తి చేసి అదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ హాస్పిటల్లో గత 5 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నది. పత్రుబాయి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి గత 4 సంవత్సరాలుగా కరీంనగర్ లో ఆరోగ్య హాస్పిటల్లో ప్రైవేట్ గా విధులు నిర్వహిస్తోంది. ఒక వైపు కుటుంబాన్ని చూసుకుంటూ, మరో వైపు ఉద్యోగానికి సన్నద్ధం అయ్యి, ప్రభుత్వ కొలువుకు ముగ్గురు తోడు కోడళ్ళు ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News