Telangana: తెలంగాణ ఉద్యోగాల భర్తీకి కసరత్తు

Telangana: 30వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్

Update: 2022-03-31 00:58 GMT

Telangana: తెలంగాణ ఉద్యోగాల భర్తీకి కసరత్తు

Telangana: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం శాఖల వారీగా సమీక్షలు జరుపుతోంది. ఇప్పటికే ఆర్ధిక శాఖ  30వేల ఉద్యోగాలకు  పైగా క్లియరెన్స్ ఇవ్వడం తో నోటిఫికేషన్ కోసం కసరత్తు జరుగుతుంది. మరొక వారం  రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు TSPSC అధికారులు.

రెండో సారి  టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత తో పాటు ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో ప్రభుత్వం దిగి వచ్చి ఉద్యోగాల భర్తీ కి ముందుకు వచ్చింది. ఆర్ధిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాల తో పాటు మరికొన్ని ఉద్యోగాల భర్తీ కి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ  ఉద్యోగులకు సీనియారిటీ బేస్డ్ గా  ప్రమోషన్ల తో పాటు 317  జీవో ప్రకారం బదిలీలు కూడా దాదాపు పూర్తయ్యాయి.

రాష్ట్రంలో మొత్తం దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఏర్పాటైన ఉద్యోగుల అలాట్మెంట్ కమిటీ జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల  డిపార్ట్ మెంట్ ల వారీగా ఉద్యోగుల విభజన పూర్తి అయింది.దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా శాఖలలో ఉన్న ఖాళీలను గుర్తించింది ప్రభుత్వం. దాదాపు 80వేలకు పైగా ఖాళీలు ఉన్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీ లో ప్రకటించారు. తరువాత 30వేల ఉద్యోగాలకు ఆర్థిక  శాఖ క్లియరెన్స్ ఇచ్చింది.

ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు  శాఖల వారిగా రిజర్వేషన్లతో పాటు ఆ పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఇండెంట్ ను TSPSC కి పంపించనున్నారు. ఆ తరువాత వారం నుండి 10 రోజుల పరిశీలన తరువాత టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది.ఇక నుండి విడుదల అయ్యే ఏ నోటిఫికేషన్ అయిన కొత్త రోస్టర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.

Tags:    

Similar News