Jeevan Reddy: ఎస్సారెస్పీలో నీటి కొరతకు కెసిఆర్‌దే నైతిక బాధ్యత
Jeevan Reddy: పవర్ ప్లాంట్‌పై జ్యూడిషియల్ ఎంక్వరి వేయడంతో భయం పట్టుకుంది
Jeevan Reddy: ఎస్సారెస్పీలో నీటి కొరతకు కెసిఆర్‌దే నైతిక బాధ్యత
Jeevan Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎస్సారెస్పీలో నీటి కొరతకు కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. సాగు నీటి రంగం, విద్యుత్ రంగంపై కేసీఆర్ పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. కేసీఆర్ ఇన్ని రోజులు మాట్లాడితే బీఆర్ఎస్ నేతలకు ఇనసొంపుగా ఉండేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే సీసం పోసినట్టు ఉందా అంటూ విమర్శించారు. జాతీయ స్థాయిలో బీజేపీ తుడిచిపెట్టుకు పోతుందన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ బయట పెట్టడానికి ఎందుకు భయపడుతుందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.