Pawan Kalyan: తెలంగాణలో పార్టీ పెట్టబోయే షర్మిలకు శుభాకాంక్షలు
తెలంగాణలో మా పార్టీ కూడా యాక్టివ్‌గా ఉంది. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యారని విన్నాను.
పవన్ కల్యాణ్ , వైఎస్ షర్మిల
Pawan Kalyan: తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోయే వైఎస్ షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్. తెలంగాణలో తమ పార్టీ కూడా యాక్టివ్‌గా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యారని విన్నానని అన్నారు పవన్‌కల్యాణ్. వేల కోట్లతో రాజకీయాలు ముడిపడి ఉన్నాయని.. యువరక్తం రాజకీయాల్లోకి రావాలన్నారు. వారసత్వ రాజకీయాలను తాను ప్రోత్సహించనన్నారు జనసేన చీఫ్.