Jagadish Reddy: విభజించు - పాలించు అనే బిజెపి సిద్దాంతాన్ని ప్రజలు తిప్పికొడతారు
Jagadish Reddy: దేశాన్ని నాశనం చేయాలన్నదే బీజేపీ ఎజెండా
Jagadish Reddy: విభజించు - పాలించు అనే బిజెపి సిద్దాంతాన్ని ప్రజలు తిప్పికొడతారు
Jagadish Reddy: యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి నిన్నటి అమిత్ షా సభ విమర్శల నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని నాశనం చేయాలన్నదే బీజేపీ ఎజెండా అన్నారు. ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందనే భావనతో బిజెపి నేతలున్నారని ఆయన ఫైరయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటం దేశానికే గొప్ప చైతన్యం తెచ్చిందనీ...రైతాంగమే ఆయుధాలు పట్టి పోరాడిన చరిత్ర తెలంగాణదని గుర్తు చేశారు. తెలంగాణ గడ్డ మీద బిజెపి నేతల ఆగడాలు సాగవని హెచ్చరించారు. విభజించు - పాలించు అనే బిజెపి దుర్మార్గపు సిద్దాంతాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు.