Remdesivir: తెలంగాణ రాష్ట్రానికి రెమిడిసివర్ ఇంజక్షన్లు పెంపు

Remdesivir: రేపటి నుంచి రోజూ 10,500 ఇంజక్షన్లు * అదనంగా 200 టన్నుల ఆక్సిజన్ సరఫరా

Update: 2021-05-16 05:43 GMT

రెమదేసివిర్ ఇంజక్షన్ (ఫైల్ ఇమేజ్)

Remdesivir: కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణకు ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసిన చెప్పారు. తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న 5 వేల 500 రెమిడిసివర్ల ఇంజక్షన్‌ల సంఖ్యను, సోమవారం నుంచి 10 వేల 500 పెంచుతున్నట్టు కేంద్ర మంత్రి సీఎంకు తెలిపారు.

ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో.. అదనంగా 200 టన్నుల ఆక్సిజన్‌ను తెలంగాణకు సరఫరా చేయాలని కేంద్ర నిర్ణయించిందన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాయ్ నుంచి, ఒరిస్సాలోని అంగుల్ నుంచి, పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్ నుంచి తెలంగాణకు ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్రమంత్రి తెలిపారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి సీఎంను కోరారు. వ్యాక్సిన్ల ను కూడా పెద్దమొత్తంలో తెలంగాణకు సరఫరా చేయాలని సీఎం కోరిన నేపథ్యంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సెకండ్ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా పియుష్ గోయల్ చేసిన విజ్ఞప్తికి కేసీఆర్ సానుకూలంగా స్పదించారు..

Tags:    

Similar News