తెలంగాణ న్యూ సెక్రటేరియట్‌లో ఇవాళ ఆలయాల ప్రారంభం
Telangana Secretariat: సచివాలయం ప్రాంగణంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఆలయాలు నిర్మాణం
తెలంగాణ న్యూ సెక్రటేరియట్‌లో ఇవాళ ఆలయాల ప్రారంభం
Telangana Secretariat: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నూతనంగా నిర్మించిన ఆలయాలను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్‌లో ప్రాంగంణంలోని ఆలయాలు నిర్మించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా గవర్నర్ తమిళిసైను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. స్పందించిన ఆమె తప్పక వస్తానంటూ మాట ఇచ్చారు.
ఇక ఇవాళ ప్రారంభోత్సవాల సంగతి చూస్తే... సచివాలయ ప్రాంగణంలో.. శివుడు, వినాయకుడు, పోచమ్మ, హనుమంతుడి ఆలయాలు ఉన్నాయి. అలాగే మసీదు, చర్చిని కూడా నిర్మించారు. ఆయా మతాల సంప్రదాయాల ప్రకారం.. ఇవాళ అన్నింటినీ ప్రారంభిస్తారు. వీటిలో కొన్ని ఇదివరకే ఉన్నాయి. వాటిని మళ్లీ సరికొత్తగా నిర్మించారు.
ఉదయం 8 గంటలకు చండీయాగం, దిగ్బలి, ప్రాణప్రతిష్ట, హోమం వంటివి ఉంటాయి. ఉదయం 9.30కి ధ్వజస్థంభాన్ని ప్రతిష్టిస్తారు. 9.59కి యంత్ర ప్రతిష్టాపన ఉంది. ఉదయం 10 గంటలకు విగ్రహాల ప్రతిష్టాపన ఉంటుంది. 11.45కి మూడు ఆలయాల శిఖర కుంభాబిషేకం ఉంది. 12.30 నుంచి గంటపాటూ.. మహా పూర్ణాహుతి, మహా మంగళహారతి, మహాదాశీర్వచనం వంటివి ఉన్నాయి. మధ్యాహ్నం 1.30కి అన్ని కార్యక్రమాలూ ముగిసేలా షెడ్యూల్ ఉంది.