తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావం

Telangana: *ఇవాళ, రేపు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు

Update: 2022-06-15 06:35 GMT

తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావం

Telangana:  నైరుతి రుతుపవనాలు ఇవాళ, రేపు తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో విస్తరించడానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ తెలంగాణలో అక్కడక్కడ భారీగా, రేపు ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన సమయంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8గంటల వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నగర శివారులోని మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ ప్రాంతంలో 9.1 సెంటీమీటర్లు, చర్లపల్లిలో9, బిచ్కుందలో 8.3, ఖమ్మంలో 7.6, కీసరలో 6.2, సింగపూర్‌ టౌన్‌షిప్ వద్ద 5.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు లేని ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.

హైదరాబాద్‌లో ఉదయం నుంచి పలుచోట్ల వర్షాలు కురిశాయి. వనస్థలిపురం, ఎల్బీనగర్‌, తార్నాకలో వర్షం పడింది. రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. పాతబస్తీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఛత్రినాక, శివగంగా నగర్‌, శివాజీ నగర్‌లో రోడ్లపై వరదనీరు ప్రవహిస్తోంది.

Tags:    

Similar News