Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన.. ఎల్లో అలర్ట్ జారీ..
Weather Report: ఈనెల 21వరకు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం
Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన.. ఎల్లో అలర్ట్ జారీ..
Weather Report: వేసవి తాపంతో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. మూడు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్టు తెలిపింది. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. ఇవాళ్టి నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్‌గిరికి కూడా అలర్ట్ ఉంటుందని తెలిపింది. ఈనెల 21వరకు ఆయా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మూడురోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది వాతావరణ శాఖ.