HYDRAA Police Station: నేటి నుంచి అందుబాటులోకి హైడ్రా పోలీస్ స్టేషన్
HYDRAA Police Station: ప్రభుత్వ భూముల పరిరక్షణ ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థలో ఇవాళ్టి నుంచి పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులోకి రానుంది.
HYDRAA Police Station: నేటి నుంచి అందుబాటులోకి హైడ్రా పోలీస్ స్టేషన్
HYDRAA Police Station: ప్రభుత్వ భూముల పరిరక్షణ ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థలో ఇవాళ్టి నుంచి పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులోకి రానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు.
ఆక్రమణదారులపై కేసు నమోదుచేసి త్వరితగతిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా రాణిగంజ్‌లోని బుద్ధభవన్ సమీపంలో హైడ్రా పోలీస్ స్టేషన్ నిర్మించారు. ఇందులో ఎస్‌హెచ్‌వోగా ఏసీపీ తిరుమల్‌ను నియమించారు. ఆరుగురు ఇన్ ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్‌ఐలతో పాటు 30 మంది కానిస్టేబుళ్లు ఈ పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉంటారు.
హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రాయణగుట్టలో షాపులను హైడ్రా అధికారులు కూల్చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. దీంతో పోలీసులకు, పాతబస్తీ వాసులకు మధ్య తోపులాట జరిగింది. హైడ్రా జేసీబీ ఎక్కి, జేసీబీ ముందు పడుకొని కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. హైడ్రాకు, రంగనాథ్‌కు వ్యతిరేకంగా MIM కార్పొరేటర్లు నిరసనలు చేపట్టారు. నిరసనలను తెలిపిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.