మెట్రోలో గుండె తరలింపు విజయవంతం

Update: 2021-02-02 14:05 GMT

బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను ఎల్బీ నగర్‌ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి విజయవంతంగా తరలించారు. న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన 45 ఏండ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్య‌క్తికి అమ‌ర్చ‌నున్నారు. గుండెను కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్‌ వరకు రోడ్డుమార్గంలో.. నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు మెట్రో రైలులో తీసుకెళ్లారు. తొలిసారిగా గ్రీన్‌ఛానల్‌ ద్వారా మెట్రో రైలులో గుండెను తరలించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ నుంచి అపోలో ఆస్పత్రి వరకు మళ్లీ రోడ్డుమార్గంలో తీసుకెళ్లారు. మరోవైపు జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు ఇప్పటికే వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్టర్‌ గోఖలే నేతృత్వంలో ఈ శస్త్ర చికిత్స జరగనుంది.



Tags:    

Similar News