హైదరాబాద్‌లో లక్షన్నర రూపాయలు విలువ చేసే బొన్సాయి చెట్టును దొంగతనం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 12న తమ ఇంటి ఆవరణలో పెంచుకుంటున్న బొన్సాయి చెట్టు చోరీకి గురైందంటూ మాజీ ఐపీఎస్ అధికారి అప్పారావు జుబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరిని అరెస్టు చేసి బొన్సాయి చెట్టును స్వాధీనం చేసుకున్నారు. గడిచిన సోమవారం నాడు చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 18లోని ప్లాట్ నంబరు 406లో మాజీ డీపీపీ అప్పారావు నివసిస్తున్నారు. ఇంటి ఆవరణలో 15 ఏళ్ల నాటి బోన్సాయి(సరు చెట్టీ-కాసురీనా) వృక్షం ఉంది. మొక్కలకు నీళ్లు పెట్టే క్రమంలో బోన్సాయి వృక్షం మాయమైనట్లుగా తోటమాలి గుర్తించాడు. విషయాన్ని యజమానుల దృష్టికి తీసుకువెళ్లాడు. విలువైన బోన్సాయి వృక్షం చోరీపై అప్పారావు సతీమణి శ్రీదేవి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.