మునుగోడు గెలుపు ప్రజలే నిర్ణయిస్తారన్న మంత్రి తలసాని
Talasani Srinivas Yadav: ప్రజా దీవెన సభకు హైదరాబాద్ నుండి భారీ ర్యాలీ
మునుగోడు గెలుపు ప్రజలే నిర్ణయిస్తారన్న మంత్రి తలసాని
Talasani Srinivas Yadav: మునుగోడు ఎన్నికల్లో గెలుపెవరిదో ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజా దీవెన సభకు హైదరాబాద్ నుండి 13 వందల కార్లలో ర్యాలీగా వెళుతున్నట్లు వెల్లడించారు. అన్ని ప్రాంతాల నుండి నేతలు ఉప్పల్ బగాయత్ చేరుకొని.... సీఎం కాన్వాయ్ వెంట మునుగోడుకు వెళుతున్నట్లు తలసాని తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చేతకాని తనం వల్లే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఏది ఏమైనా ప్రజలు కోరుకునేది గులాబీ జెండానేనని మంత్రి తలసాని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలను రాష్ట్ర ప్రజలు కోరుకోవడం లేదన్నారు.