Gangula Kamalakar: గంగుల హాట్‌కామెంట్స్.. తెలంగాణను ఆంధ్రాలో కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి..
Gangula Kamalakar: ఇప్పుడు తెలంగాణలో అధికారం కోసం ఎగబడుతున్నారు
Gangula Kamalakar: ఒకవేళ కేసీఆర్ ఓడిపోతే ఢిల్లీ పాలకులతో మాట్లాడి.. తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్ర చేస్తున్నారు
Gangula Kamalakar: తెలంగాణను ఆంధ్రాలో కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. కాంగ్రెస్, బీజేపీ ముసుగులో ఆంధ్రోళ్లు తెలంగాణకు వస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఒకవేళ కేసీఆర్ ఓడిపోతే.. ఢిల్లీ పాలకులతో మాట్లాడి.. తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
భవిష్యత్ తరాన్ని కాపాడుకోవాలంటే.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఢిల్లీ నేతల చేతుల్లో కాకుండా, కేసీఆర్ చేతుల్లో పెట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ పాలకులంతా తెలంగాణ వ్యతిరేకులన్న గంగుల.. గతంలో తల్లిని చంపారు, బిడ్డను బతికించారన్న మోడీ వ్యాఖ్యలను గుర్తుచేశారు. ఒకప్పుడు తెలంగాణపై విషం చిమ్మినవారే.. ఇప్పుడు తెలంగాణలో అధికారం చేపట్టేందుకు ఎగబడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు గంగుల.