సూర్యాపేటలో దారుణం: రోకలిబండతో భార్యను హతమార్చిన భర్త
సూర్యాపేట జిల్లా సిరికొండలో దారుణం రోకలి బండతో భార్యను కొట్టిచంపిన భర్త కొన్నిరోజులుగా భార్యభర్తల మధ్య కలహాలు అనంతరం పీఎస్‌లో లొంగిపోయిన నిందితుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సూర్యాపేటలో దారుణం: రోకలిబండతో భార్యను హతమార్చిన భర్త
సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కట్టుకున్న భర్తే కాల యముడిగా మారి భార్యను అతి కిరాతకంగా హతమార్చాడో భర్త. సూర్యాపేట జిల్లా సిరికొండలో ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కారింగుల వెంకన్న, ఆయన భార్య పద్మ మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. గొడవలు తారస్థాయికి చేరడంతో కోపంతో భర్త వెంకన్న.. పద్మను రోకలిబండతో కొట్టి చంపాడు. పద్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన అనంతరం వెంకన్న పీఎస్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో సిరికొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి.